ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘నేను పుట్టిన ఈ భూమికి నమస్కారం.. చెన్నై ప్రజలకు నమస్కారం. ఇది మరచిపోలేని రోజు. ఎన్నో ఏళ్లుగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. థాంక్యూ.. నేను ఇరవై ఏళ్లుగా సినీ రంగంతో మమేకమై ఉన్నాను. నా సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నాను. పుష్ప ప్రమోషన్స్ కోసం ఇతర దేశాలకు వెళ్లాను. ఇతర రాష్ట్రాలకు వెళ్లాను. కానీ చెన్నైకు వచ్చినప్పుడు ఉన్న ఫీలింగే వేరే లెవల్. ఎందుకంటే చెన్నై నుంచే నా జర్నీ ప్రారంభమైంది. అందుకనే నాకు చెన్నైతో ఎమోషనల్ ఎటాచ్మెంట్ ఉంటుంది. సైకలాజికల్‌గా ఓ విషయం చెబుతుంటారు. తొలి ఇరవై సంవత్సరాలు ఎలాగైతే నువ్వు జీవించావో.. మిగిలిన లైఫ్ అంతా అలాగే జీవిస్తావని. నేను తొలి ఇరవై ఏళ్లు చెన్నైలోనే ఉన్నాను. కాబట్టి నేను ఏం సాధించినా నా రూట్స్‌లో భాగమైన చెన్నైకు డేడికేట్ చేస్తున్నాను. ఈరోజు నేను ఏదైతే సాధించానో దాన్ని తమిళ సంస్కృతి నాకు నేర్పించింది. నేను ఎక్కడికి వెళ్లినా సాదా సీదా టీ నగర్‌కు చెందిన కుర్రాడినే. నేను మైక్‌లో మాట్లాడే సందర్భంలో అప్పుడప్పుడు తమిళ్ మరచిపోతుంటానేమో కానీ.. ఫ్రెండ్స్‌తో కూర్చుంటే మాత్రం.. ఏ మచ్చా.. అనే మాట్లాడుతాను. నేను నేషనల్, ఇంటర్నేషనల్‌కు వెళ్లొచ్చు. కానీ ఓ చెన్నై కుర్రాడు అంత దూరం వెళ్లాడని అందరూ చెప్పుకుంటారు. అందుకు చెన్నైకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మూడేళ్లు వైల్డెస్ట్ ఫైర్‌ను అందించటానికి పుష్ప సినిమా కోసం కష్టపడ్డాను. కచ్చితంగా ఆ ఫైర్ మీ హృదయాలను జ్వలింప చేస్తుందని అనుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ నిలబడటం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. నేను చాలా సార్లు చెన్నైకు వచ్చాను. మాట్లాడాను. అయితే చెన్నైలో ఓ గ్రాండ్ ఫంక్షన్ చేయాలని మనసులో ఉండింది. నా ఊరిలో నాకు ఒక ఫుల్ ఆడిటోరియం ఫంక్షన్ కావాలని అనుకునేవాడిని. అది నా లైఫ్‌లో ఓ మార్క్. ఇక్కడకు తెలుగువాళ్లు, అభిమానులు వచ్చినప్పటికీ నేను తమిళంలోనే మాట్లాడుతాను. మాట్లాడాలి. ఎందుకంటే ఈ మట్టికి మనం ఇవ్వాల్సిన గౌరవం అది. మనం ఏ మట్టిలో అయితే నిలబడి ఉంటామో ఆ భాషలోనే మాట్లాడాలి. నేను దుబాయ్ వెళితే అరబిక్‌లోనే మాట్లాడుతాను. నార్త్‌కు వెళితే హిందీలో మాట్లాడుతాను.
పుష్ప గురించి మాట్లాడాలంటే ముందుగా నా నిర్మాతల గురించి మాట్లాడాలి. ప్రొడ్యూసర్స్ నవీన్‌గారు, రవిగారు, చెర్రీగారికి థాంక్స్. వీళ్లు లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేదే కాదు. నాకు సొంత బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ ఉంది. అయితే పుష్ప సినిమాను వీళ్లు చేసినట్టు మరొకరు చేసుండరని చెప్పగలను. నిర్మాతలు నాపై నమ్మకంతో నాలుగేళ్లు సపోర్ట్ చేసినందుకు వారికి థాంక్స్. నా బాల్య స్నేహితుడని చెప్పాలా.. మరేదైనా చెప్పాలో తెలియటం లేదు కానీ.. నేను చేసిన ఇరవై సినిమాల్లో పది సినిమాలకు అతనే సంగీతాన్ని అందించారు. అతనే మా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. సూపర్బ్ మ్యూజిక్ డైరెక్టర్. ఎన్నో సూపర్ మ్యూజిక్ ట్రాక్స్‌ను అందించిన సంగీత దర్శకుడు ఆయన. తను కేవలం సంగీతమే కాదు.. ప్రేమను ఇచ్చాడు. తను లేకుండా నా జర్నీ సాధ్యమయ్యేది కాదు. అందుకు తనకు ధన్యవాదాలు. నా సాంకేతిక నిపుణులకు థాంక్స్. కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్ సహా అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఇక నటీనటుల విషయానికి వస్తే.. ముఖ్యంగా నాలుగేళ్లుగా రష్మిక అనే అమ్మాయినే చూస్తున్నాను. తనకు థాంక్స్. ఈ సినిమాలో నేను ఇంత మంచి పెర్ఫామెన్స్ చేశానంటే కారణం.. తను ఇచ్చిన కంఫర్టే కారణం. నేను కెరీర్లో తొలిసారి ఓ పాటకు డాన్స్ చేసేటప్పుడు ముందుగానే జాగ్రత్తపడ్డాను. అందుకు కారణం డాన్సింగ్ క్వీన్ శ్రీలీల. తను చాలా హార్డ్ వర్కింగ్ మాత్రమే కాదు.. సూపర్ క్యూట్ గర్ల్. తను ఈ పాటలో చేసిన డాన్స్ గురించి నేను చెప్పటం కాదు.. మీరు చూడాలంతే. అందరికీ నచ్చేస్తుంది. పుష్ప మూవీ డైరెక్టర్ సుకుమార్‌గారు.. చెప్పాలంటే తను లేకపోతే ఆర్య లేదు. ఆ సినిమా వల్లనే నేను ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఎందుకంటే నాకు తొలి సినిమాను హిట్ మూవీగా ఇచ్చారు డైరెక్టర్ రాఘవేంద్రరావుగారు. అయితే ఆ సినిమా తర్వాతే నేను ఏడాది పాటు ఖాళీగా ఉన్నాను. కథలు వింటూ ఉండేవాడిని. నాతో సినిమా చేయటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో ఓ డైరెక్టర్ వచ్చి సినిమా చేశారు. ఆయనే సుకుమార్‌గారు. తర్వాత నుంచి వెనుదిరిగి చూసుకునే అవకాశమే లేకపోయింది. నేను నా లైఫ్‌లో వెనుదిరిగి చూసుకుని ఇంతగా నా లైఫ్ మారటానికి కారణమైన వ్యక్తి ఎవరా అంటే నేను సుకుమార్‌గారి పేరునే చెబుతాను. ఆయనెంతో సిన్సియర్ ఫిల్మ్ డైరెక్టర్. ఇంత పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నా.. ఆయన స్టేజ్‌పైకి రాకుండా పని చేసుకుంటున్నారు. ఇదే చాలు.. ఆయనేంటో చెప్పటానికి. ఇక చివరగా నాకెంతో ఇష్టమైన వాళ్లు ..నా ఫ్యాన్స్. వాళ్లు నా ఆర్మీ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. వాళ్లు నాకోసం నిలబడ్డారు. నాకోసం ఫైట్ చేశారు. వాళ్లు నామీద ప్రేమను చూపించారు. మూడేళ్లుగా వాళ్లని చూస్తున్నారు. వాళ్ల ప్రేమకు ధన్యవాదాలు. వాళ్ల వెయిటింగ్‌ను నేను వృథా కానివ్వను. వాళ్ల ప్రేమ నాపై తగ్గకుండా డిసెంబర్ 5న అందరి హృదయాల్లో వైల్డ్ ఫైర్‌ను తీసుకొస్తాను. నాపై ప్రేమను చూపిస్తున్న అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు.