ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి క్రైమ్ థ్రిల్లర్ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’, మలయాళ హీరో టోవినో థామస్ ‘నారదన్’
ఈ వీక్ ఆహాలో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఓటీటీ లవర్స్ కోసం స్ట్రీమింగ్ కు వచ్చాయి. టాలెంటెడ్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ నిన్నటి నుంచి (నవంబర్ 28) స్ట్రీమింగ్ అవుతుండగా..ఈరోజు నుంచి (నవంబర్ 29) మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ “నారదన్” స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
“తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి” చిత్రంలో నిరంజన అనూప్, మణికందన్ ఆర్. ఆచారి ఇతర కీలక పాత్రలు పోషించారు. నారాయణ చెన్నా దర్శకత్వం వహించారు. బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో సాగే ఈ మూవీలో ప్రియదర్శి పర్ ఫార్మెన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి ఆహాలో తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
ఇక మలయాళ స్టార్ టోవినో థామస్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం “నారదన్” నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో అన్నా బెన్, షరాఫుద్దీన్, ఇంద్రన్స్, జాఫర్ ఇడుక్కి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో జర్నలిస్ట్ చంద్రప్రకాష్ పాత్రలో టోవినో నటన ఆకర్షణగా నిలుస్తోంది. టీఆర్ పీ రేటింగ్స్ కే ప్రాధాన్యత ఇస్తున్న నేటి జర్నలిజంలో నైతిక విలువలు, జర్నలిస్ట్ జీవితంలో ఎదురయ్యే ఘటనలను ఎంతో సహజంగా నారదన్ చిత్రంలో చూపించారు.